కాంగ్రెస్ పార్టీ డిఎన్ఎలొనే అవినీతి సంస్కృతి.
--కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆదాని అంబానీ 20 లక్షల కోట్ల ఎగవేత పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.
--6 గ్యారెంటీలు 420 హామీల అమలు చేతగాక సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు.
--తాండూర్ లొ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు ప్రభుత్వ ఆస్తుల అక్రమలపై చర్యలు ఏవి.
--వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్ ,బీఆర్ఎస్ నేతలు.
తాండూరు (వికారాబాద్ జిల్లా)కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోని అవినీతి సంస్కృతి ఉందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్, టిఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో అన్నారు. నిన్న బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తాండూరు టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని వారు ఖండించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర గౌడ్, సీనియర్ నాయకులు పట్లొల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, సంతోష్ గౌడ్, మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయడం చేతగాక అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. హైదరాబాదులో హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చి ఉసురు పోసుకున్న ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది అన్నారు, అదేవిధంగా రాష్ట్రంలో 22 ఏ పేరుతో పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి 30% కమిషన్ కాంగ్రెస్ దండుకుంటుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 20 లక్షల కోట్ల పన్ను ఎగవేత చేసిన ఆదాని అంబానీ లపై, ఎలాంటి చర్యలు తీసుకుందో, కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్న కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ ఆయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లలో రెండున్నర లక్షలు కోట్ల అప్పులు చేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకున్న ఘనత కేసిఆర్ దే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లలో తొమ్మిది లక్షల కోట్ల అప్పులు చేసి రాహుల్ గాంధీ చంద్రబాబులకు పంపిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయన సోదరుడు అధికార మదంతో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సర్వేనెంబర్ 130, 111, పోట్లీ మహారాజ్ షాపింగ్ కాంప్లెక్స్, భద్రేశ్వర ఆలయం లొ అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాండూర్ లో బుయ్యని బ్రదర్స్ అంత గలీజ్ పాలన జరుగుతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో మళ్ళీ వచ్చుడు లేదని సచూడు లేదని గ్రహించి అందిన కాడికి దండుకోవడమే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పదేపదే కోటిపల్లి ప్రాజెక్టులు తట్టేదుడు మట్టి తీయలేదని అనడంలో అసలు మతలబ్ కోటిపల్లి ప్రాజెక్టు పేరుతో ఆగ మేఘాల మీద నిధులు తీసుకువచ్చి కెనాల్ కాలువలు నిర్మాణాన్ని చేపట్టి తాండూరు నుండి కాగ్న నీటిని కొడగల్ కు తరలించే కుట్ర చేస్తున్నారని అన్నారు. తాండూర్ లో బుయాని బ్రదర్స్ ఇసుక మట్టి అక్రమంగా తరలిస్తూ, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణలు చేస్తూ దండుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ నుండి ఇసుక మట్టి నీళ్లు తరలిపోకుండా టిఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్లు సురేష్ నాయక్, యోగానంద్, శ్యామ్ రెడ్డి, అనంతరెడ్డి, భాస్కర్, ఇజియాజ్, తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


