జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్
నాగర్ కర్నూల్,:తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీడా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని, స్వాతంత్ర్య సమరయోధుల వీరోచిత పోరాటాలను స్మరించుకోవాలన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, కొమురం భీం వంటి యోధులు చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనంలో కీలక పాత్ర పోషించారని, చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.జిల్లా పోలీసుల పనితీరు బాగుందని, మరింత ఉత్సాహంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పోలీసు అధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ బుర్రి శ్రీనివాస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


