అతిధి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.
గంభీరావుపేట :గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి ఆధ్యాపకుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. వి .విజయలక్ష్మి బుధవారం తెలిపారు. కామర్స్_1(ఏ ఈ డి పి) సబ్జెక్టులో పిజి 55%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు దరఖాస్తులను గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో అందజేయాలని తెలిపారు. ఎంపిక ప్రక్రియ బుధవారం 23 న సిరిసిల్ల ప్రభుత్వ (అగ్రహారం)డిగ్రీ కళాశాలలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


