దసరా నవరాత్రి ఉత్సవ కమిటీ ఎన్నిక

దసరా నవరాత్రి ఉత్సవ కమిటీ ఎన్నిక

  • అధ్యక్షుడిగా కలిమిచర్ల గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక
  • ప్రధాన కార్యదర్శులుగా నారాయణ రాజు, పానుగంటి నవీన్, బాదం రాఘవేందర్

కల్వకుర్తి  : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నూతన ఉత్సవ కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవాలయ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు వివిధ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కలిమిచర్ల గోపాల్, ప్రధాన కార్యదర్శులుగా నారాయణ రాజు, పానుగంటి నవీన్, బాదం రాఘవేందర్, కోశాధికారులుగా గుబ్బ కిషన్ కుమార్, వాస మనీష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కలిమిచర్ల గోపాల్ మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వాస శేఖర్, గందె రవి, కలిమిచర్ల రాఘవేందర్, గుబ్బ ప్రభాకర్, ఇరివెంటి రమేష్, జూలూరి ప్రకాష్, జూలూరి సత్యనారాయణ, దాచేపల్లి మనోహర్, దాచేపల్లి తిరుపతయ్య, పీఎస్ఎన్ గుప్తా, మాచిపెద్ది అశోక్, శివ్వ రాఘవేందర్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 38

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: