గణేష్ గరుడ యువసేనకు రూ. 10,000 విరాళం అందజేసిన బుషిగంపల ఆంజనేయులు
లింగాల గణపురం (జనగాం)కళ్లెం (జనగామ): గ్రామ యువత ఉత్సాహంగా నిర్వహించే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు అభినంద నీయమని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు అన్నారు. మండలంలోని కళ్లెం గ్రామంలో గురువారం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా చౌరస్తాలో ఏర్పాటు చేసిన "గణేష్ గరుడ యువసేన" మండపానికి ఆయన రూ. 10,000/- (పది వేల రూపాయలు) ఆర్థికసహాయాన్ని చందా రూపంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ ఐక్యతకు, ధార్మిక చింతనకు వినాయక నవరాత్రి ఉత్సవాలు నిదర్శనమని పేర్కొన్నారు. యువకులు భక్తిశ్రద్ధలతో పండగను జరుపుకుంటూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ గరుడ యువసేన కమిటీ నిర్వహకులు, గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొని ఆంజనేయులుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


