తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండ న్యూస్ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్మరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజా పాలన కోసం ఎందరో వీరులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.తెలంగాణ ప్రజల హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన వారి స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు.మహనీయులను స్మరించుకుని నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు,వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు,ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మెట్టుగుట్ట దేవస్థానం చైర్మెన్ పైడిపాల రఘు చందర్,సొసైటీ చైర్మెన్ రాజేష్ ఖన్నా,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎద్దు సత్తన్న,మండల అధ్యక్షులు పో వెంకన్న, టౌన్ అధ్యక్షులు ఈగ దామోదర్, సర్పంచ్లు, కౌన్సిలర్లు మహిళా సోదరిమణులు,నాయకు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


