ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం, చౌటకూర్‌లో జెండా ఆవిష్కరణ
చౌటకూర్:- చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటకూర్ మండల కేంద్రంలో గురువారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, పశువైద్యాధికారుల కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది దేశభక్తి మరియు తెలంగాణ ఉద్యమ చరిత్రను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పలువురు అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ అనుదీప్, ఎంపీడీవో కె. శంకర్, ఆర్‌ఐ ప్రవీణ్ కుమార్, ఎంపీవో సువర్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


