గుండేకల్లూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు కార్డులు అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్
బిచ్కుంద, : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండేకల్లూర్ గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ఆవరణలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తొలుత తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించి, అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ సావిత బాయి, ఉప సర్పంచ్ లాలయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఉదయ్ పటేల్, షాదుల్, ప్రకాష్, పీరుగొండతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


