ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం

హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం

చిలిపిచేడ్ (మెదక్ జిల్లా):చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో చాకలి యాదయ్య ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు అనంతరం దేవుని చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. చాకలి యాదయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి తమ సొంతింటి కలను నెరవేర్చుకునేలా చేసినందుకు కృతజ్ఞతగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి  చాకలి యాదయ్య కుటుంబానికి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, ఫైజాబాద్ గ్రామ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, సంగ గౌడ్, ఎంసీ విఠల్, రాజు, నరసింహారెడ్డి, గోపాల్ రావు, రాజేందర్, జనార్దన్, కిరణ్, షాపి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీఓ మునిరుధ్ధిన్, హౌసింగ్ ఏఈ అభిషేక్, గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News