మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు:
మేడ్చల్ మల్కాజిగిరి : మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ శంభీపూర్ రాజు జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, ప్రజల ఐక్యత, త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు,కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


