బాల్కొండ నియోజక వర్గంలో జోర్ధార్ గ కొనసాగుతున్న గణేష్ పూజలు
బాల్కొండ (నిజామాబాదు జిల్లా) :నిజామాబాదు జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని గ్రామాల్లో గణేష్ పూజలు జోర్ధార్ గ కొన సాగుతున్నాయి. విఘ్నా లను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ఊరురా గణేష్ మండపాల భక్తులు గణేష్షుణ్ణి వేడు కొంటున్నారు.అనేక గణేష్ మండపల్లో భక్తులు జోరుగా భజనలు చేస్తూరు. ఇది ఇలా ఉండగా గత సంవత్సరo కంటే ఈ సంవత్సరo కేవలం మట్టి గణపతులనే ప్రతి ష్టించడం విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని బాల్కొండ నియోజక వర్గంలోని గ్రామాల్లో సామజిక సేవా సంస్థలు ముందుకు రావడం తో విశ్వహిందూ పరిషద్ తరపున మట్టి వినాయకులను అనేక గ్రామాల్లో పంపిణీ చేసారు. ఈ సందర్భంగా బుధవారం రోజు బాల్కొండ లోని అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక గణపతి పూజ కార్యక్రమాన్ని మెడికల్ నరేందర్ ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకు లను పూజించటం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి కాలుష్యాన్ని నివారించిన్నట్లు అయిందని అన్నారు.ప్రత్యేక పూజ లక్ష్మి ప్రసన్న కుటుంబం ద్వారా పూజ అనంతరం ప్రసాదం తో పాటు ఆల్ఫాహారం పంపిణి చేసారు,ఈ కార్యక్రమంలో గణేష్ జోషి,అంబటి నవీన్,బోట్ల రవీన్ ప్రసాద్, మధుసూదన్ రాజు, సుంకరి శ్రీనివాస్,లింగాగౌడ్,థౌట్ గంగాధర్, సీరియల జగన్,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


