తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చౌటకూర్‌లో జెండా ఆవిష్కరణ

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చౌటకూర్‌లో జెండా ఆవిష్కరణ

చౌటకూర్,  : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటకూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను నాయకులు, అధికారులు వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ అనుదీప్, ఎంపీడీవో కె. శంకర్, ఎంపీవో సువర్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్ పాల్గొన్నారు.అలాగే మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామగౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వర్కల రమేష్, ఉపసర్పంచ్ నాగరాణి కృష్ణ, వార్డు సభ్యులు బలరాజ్, గంగారం, చక్రపాణి, అభిలాష్, కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News