ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

గంభీరావుపేట: భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల అధ్యక్షులు కోడె రమేశ్ ఆధ్వర్యంలో గురువారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, గంభీరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారికి బ్రెడ్, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గారి జన్మదినాన్ని సేవా దినోత్సవంగా నిర్వహిస్తూ, ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇది స్ఫూర్తిదాయకమైన రోజు. “మోదీ గారి సంకల్పం – వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా అభివృద్ధికి దేశ ప్రగతికి మార్గం అన్నారు. ప్రజాసేవే బీజేపీ కార్యకర్తల లక్ష్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ ఉపాధ్యక్షులు నర్సింలు కార్యదర్శి రాజు నాయకులు బండ దేవయ్య శ్రీనివాస్ చారి శ్రీనివాస్ సర్వోత్తమ్ నర్సింలు కృష్ణ కాంత్ యాదవ్ రవీందర్ నాయక్ దేవేందర్ యాదవ్ దేవేందర్ నాయక్ రాజు శ్రీనివాస్ గౌడ్ రమేష్ రాజేష్ చారి నాయకులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News