వట్టెంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా
రక్తదాన శిబిరం 32 మంది యువకుల రక్తదానం
జిల్లా నాగర్ కర్నూల్ : ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో సర్పంచ్ జ్యోతి శంకర్, బీజేపీ నాయకులు మైకం చంద్రకళ, వినోద్, హరి ప్రసాద్, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, వడ్డే రాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.ఈ శిబిరంలో మొత్తం 32 మంది యువకులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రధాని మోదీ సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి శంకర్ మాట్లాడుతూ రక్తదానం మించిన దానం లేదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


