నార్సింగిలో ఘనంగా తెలంగాణ విమోచన,
విశ్వకర్మ జయంతి వేడుకలు
పాపన్నపేట, :పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ఉపసర్పంచ్ శ్రీరామ్ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఎగురవేసి, అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తొమ్మిది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బీకొండ రాములు నేత, మాజీ జనరల్ సెక్రటరీ దుర్గాప్రసాద్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు చంద్రన్న, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సిద్ధిరాములు, జిల్లా నాయకులు ఆకుల సుధాకర్, జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి బుల్లెట్, నార్సింగి బూత్ అధ్యక్షులు చాకలి పెంటయ్య, రామాపురం ఈశ్వర్, చాకలి సాయిలు, ఉప్పరి శ్రీకాంత్ సోలంకి, మహేష్, పాపన్నపేట పట్టణ అధ్యక్షుడు సుంకరి కిష్టయ్య, వెంకట్, సాయి బాబా, మల్లేశం, శంకర్ గౌడ్, సున్నం లక్ష్మణ్, బైండ్ల దుర్గయ్య, బైండ్ల రాజు, వడ్ల చంద్రశేఖర్, తాడేపు శేఖర్, లక్ష్మీనగర్ రమేష్, ఏడుకొండలు, యేసు, కుమార్, విట్టల్, సంతోష్ రెడ్డి, రాజుతో పాటు దాదాపు 50 మంది బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


