సిద్దిపేటలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

సిద్దిపేటలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

దేవులపల్లి మధుమతి-ఎల్లయ్య దంపతుల ప్రత్యేక పూజలు

సిద్దిపేట జిల్లా :సిద్దిపేట పట్టణ మున్సిపల్ పరిధిలోని సాయి విద్యానగర్ కాలనీలో ప్రతిష్టించిన శ్రీ వినాయక నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి మెదక్ జిల్లా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు మరియు విజన్ ఆంధ్ర సిద్దిపేట జిల్లా ప్రతినిధి దేవులపల్లి ఎల్లయ్య-మధుమతి దంపతులు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం దేవులపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి గల్లీలోనూ పూజలందుకుంటున్న విఘ్నేశ్వర భగవానుడు ప్రజలందరినీ ఆయురారోగ్యాలతో చల్లగా చూస్తాడనే నమ్మకంతో వాడవాడలా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఒకప్పుడు కేవలం మహారాష్ట్రకే పరిమితమైన ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి మన దగ్గర కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులకు అన్ని రకాల పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ పూజా కార్యక్రమంలో పెద్దన్న పంతులు, దేవులపల్లి ఐశ్వర్య-శ్రవణ్ కుమార్, లాయర్ వెంకటేశ్వరరావు-శ్రీవాణి దంపతులు, పద్మయ్య-భారతి దంపతులు, పిట్ల రాజయ్య-సరోజన, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

Views: 128

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News