అవినీతి అధికారుల అరెస్టుపై గ్రామస్తుల హర్షం 

అవినీతి అధికారుల అరెస్టుపై గ్రామస్తుల హర్షం 

కీసర,  : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ లో బుధవారం అర్ధరాత్రి ఏసీబీ సోదాలు నిర్వహించారు. సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ  అధికారులు అరెస్టు చేశారు. ఓ కేసు విషయంలో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు సీఐ రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిందితుడితో పని చేయించుకున్నారు. ఆ వేధింపులు  తట్టుకోలేక బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు. లంచం తీసుకునే బాధ్యతను ఎస్సై కి సిఐ అప్పగించాడు. ఈ సమాచారంతో డీఎస్పీ మాజీద్  అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కీసర చెరువు గట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్సై రూ. 5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతి  అధికారుల అరెస్టుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: