తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ న్యూస్ : హన్మకొండ ఐడివోసి కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా రెవెన్యూ, గృహనిర్మాణ, మరియు సమాచార-పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి మరియు వరంగల్ ఐడివోసి పక్కన ఉన్న గ్రౌండ్ లో ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయ లక్ష్మి కు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శాలువాతో సత్కరించి సాదర స్వాగతం పలికారు.హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజా ప్రతినిధులు,కలెక్టర్లు,అధికారులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


