ఘనంగా నరేందర్ మోడీ జన్మదిన వేడుకలు
అందోల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా అల్లాదుర్గం పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలలో ఉచితంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్సిళ్లు , పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం వెంకటేశ్వర దేవాలయంలో ప్రధానమంత్రి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది.అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లాదుర్గం పట్టణంలో జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిన్నా భాస్కర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కాల్ల రాములు, ఓబీసీ మండల అధ్యక్షుడు నీలి రమేష్, కాయిదంపల్లి బూత్ అధ్యక్షుడు మహేశ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు నరేందర్,బీజేవైఎం అధ్యక్షుడు మద్దూరి శివాగౌడ్ , ఏబీవీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


