నాంపల్లిలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అంబటి ఆంజనేయులు, గాంధీజీ హైస్కూల్ ఆవరణలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, పాఠశాల డైరెక్టర్ కర్నాటి నాగరాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలు, ఐక్యత, దేశభక్తి భావాలను ప్రతి ఒక్కరూ పెంపొందించు కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకన్న, కార్యాలయ సిబ్బంది, అధికారులు, గాంధీజీ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


