ఈనెల 22 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు..
- 17 నుంచి 22 వరకు వాక్-ఇన్ అడ్మిషన్లు
- ఐటీఐ ప్రవేశాలకు చివరి అవకాశం
- అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి. రమేష్ కోరారు.
కొత్తగూడెం బ్యూరో : ప్రభుత్వ, ఏటీసీ, ఆర్‌ఐటీఐ, మైనారిటీ, ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉందని ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెం ప్రిన్సిపాల్, కన్వీనర్ జి. రమేష్ తెలిపారు. ఈనెల 16 నుంచి 22 వరకు "iti.telangana.gov.in" వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో రూ.100 ధ్రువీకరణ రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ రూ.100 చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం ట్రేడ్, ఐటీఐలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు. 17 నుంచి 22 వరకు వాక్-ఇన్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు అనంతరం ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత పరిశీలన కేంద్రంగా నియమించిన ప్రభుత్వ ఐటీఐకి ఉదయం 10 గంటలకు హాజరై అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. అటెండెన్స్ తీసుకున్న వారికి మధ్యాహ్నం 1 గంట నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి, కొన్ని నిర్దిష్ట కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. 01-08-2026 నాటికి 14 సంవత్సరాలు నిండిన వారు ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, గరిష్ఠ వయోపరిమితి లేదని తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన ట్రేడ్, ఐటీఐలను ప్రాధాన్యతా క్రమంలో ఎన్ని ఆప్షన్లైనా ఎంపిక చేసుకోవచ్చని, ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా సీటు పొందే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. సీట్ల కేటాయింపు అభ్యర్థి మెరిట్, ఎంచుకున్న ట్రేడ్, ఐటీఐ ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుందని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


