మట్టి గణపతుల ఏర్పాటుకు పెద్దలు కృషి చేయాలి.

మట్టి గణపతుల ఏర్పాటుకు పెద్దలు కృషి చేయాలి.

జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్.

తాండూరు (వికారాబాద్ జిల్లా) పర్యావరణ పరిరక్షణతో పాటు కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులను ప్రోత్సహించేం దుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్, జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు.తాండూరులోని తులసీనగర్, సాయినగర్, గ్రీన్ సిటీ, దోబీగల్లి, గుమాసానగర్, నెహ్రూగంజ్, మార్కండేయ కాలనీ, గాంధీచౌక్, కోకట్ రోడ్, పాత తాండూరు తదితర ప్రాంతాల్లో మట్టి వినాయకులను ప్రతిష్ఠించిన మండపాలను రాజ్‌కుమార్ సందర్శించి, నిర్వాహకులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ, తాండూరులో వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ మట్టి వినాయకులు పదుల సంఖ్యలోనే ఉండటం ఆలోచించాల్సిన విషయమన్నారు. రాబోయే రోజుల్లో హిందూ ఉత్సవ సమితి, బీసీ సంఘం, తాండూరు పెద్దలతో కలిసి వందల సంఖ్యలో మట్టి వినాయకులను ప్రతిష్ఠించేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు,మట్టి వినాయకుల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు కాగ్నా నది, కోకట్ ప్రాంతంలోని నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చని అన్నారు. అలాగే మట్టి వినాయకుల తయారీపై ఆధారపడి జీవిస్తున్న కుమ్మరి మరియు ఇతర సంప్రదాయ కళాకారుల కులవృత్తులకు ప్రోత్సాహం అందించిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేశ్, బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల, బీసీ సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్, అంబాదాస్, పరమేశ్, హరిప్రసాద్, రాహుల్, మాధవ్, నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పరమేశ్, రజక సంఘం నాయకులు రమేష్, రాజు, వినయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News