తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే
- తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
- గిరిజన సంక్షేమానికి కేసీఆర్ హయాంలో ప్రత్యేక ప్రాధాన్యం.
తాండూరు (వికారాబాద్ జిల్లా) గిరిజన సంక్షేమం, తండాల అభివృద్ధికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలంలోని పర్షా నాయక్ తండా, తౌర్యా నాయక్ తండాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా తండా గ్రామ నాయకులు మాట్లాడుతూ.. గతంలో రోడ్డు సౌకర్యం సరిగా లేని తమ ప్రాంతాలకు పైలెట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోడ్లు వేయించారని తెలిపారు. తమ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చొరవ చూపారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజన ప్రాంతాలకు పరిపాలనా గుర్తింపు, అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు, నాయకులు వచ్చినప్పటికీ గిరిజన ప్రాంతాలపై ఈ స్థాయిలో దృష్టి సారించలేదని ఆయన పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


