గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేసిన ఘనత కేసీఆర్‌దే : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేసిన ఘనత కేసీఆర్‌దే : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

చిలిపిచేడ్ (మెదక్ జిల్లా):గిరిజన తండాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ఘనత మాజీ సీఎం,బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. చిలిపిచేడ్ మండలంలోని గన్యాతాండాలో సర్పంచ్ నీల్యపాండు నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొని కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్టీల రిజర్వేషన్‌ 10 శాతానికి పెంచి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కెసిఆర్ పాదయాత్ర సమయంలో రాత్రి ఒక గిరిజన ఇంట బస చేసిన సందర్భంగా జరిగిన సంఘటన ఆధారంగా చేసుకుని తమ ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకున్నా నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన తో సంక్షేమ పథకాలతో అండ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలతో పేద కుటుంబాలకు, ఆడపిల్లల వివాహాల కు ఆర్థిక భరోసా కల్పించారని తెలిపారు. విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పెంచి ప్రోత్సహించారని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్‌, సర్పంచులు నీలాపాండు, కున్యా, దరియా, మాజీ సర్పంచులు రాకేష్‌,శంకర్‌, యాదగిరి,గోపాల్‌రెడ్డి,నాయకులు సంగాగౌడ్‌, ఎంసీ విఠల్‌, షఫీ, ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ముకుందరెడ్డి, శంకరయ్య, బాల్‌రెడ్డి, విభీషన్‌ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-17 at 3.06.00 PM

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News