నసురుల్లాబాద్‌ లో ఘనం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు...

నసురుల్లాబాద్‌ లో ఘనం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు...

  • అంగన్‌వాడీ కేంద్రం లో పండ్ల పంపిణీ..
  •  బాన్సువాడ లో ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు..

బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల ను ఘనం గా నిర్వహించారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక అంగన్‌వాడీ పాఠశాల (కేంద్రం) లోని చిన్న పిల్లలకు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు  మాట్లాడుతూ. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తి ప్రతిష్టల ను పెంచిన గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. మోడీ  ఆయురారోగ్యాల తో వర్ధిల్లాలని, దేశానికి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చిన్న పిల్లల కు పౌష్టికాహారం అందించాల నే ఉద్దేశం తో అంగన్‌వాడీ కేంద్రం లో పండ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా బాన్సువాడ మండల కేంద్రం తో పాటు నియోజకవర్గం లోని బీర్కూర్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూరు, మోస్రా, మండల కేంద్రం లో ఘనం గా మోడీ జన్మదిన వేడుకలను బిజెపి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్ , గంగాధర్ గుప్తా, మండల ఉపాధ్యక్షులు శేఖర్, బాకా నాగరాజు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు రాందాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సాయిలు, బండపల్లి శ్రీను, జెల్ల సాయిలు, రవికాంత్, నితిన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 50

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News