అనుమతుల పేరుతో ఇసుక దోపిడీ..
అడ్డుకున్న బీజేపీ నాయకులు
తెలకపల్లి, : మండల కేంద్రంలో అనుమతుల పేరుతో నిత్యం జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను బీజేపీ మండల అధ్యక్షుడు మంద చిన్నారెడ్డి , ఉపాధ్యక్షుడు ఈర్ల శ్రీనివాస్ లు,బుధవారం సాయంత్రం అడ్డుకున్నారు. వందలాది ఇసుక టిప్పర్లతో నిరంతరం రవాణా సాగిస్తుండటంతో ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను నిలిపివేసిన నాయకులు, అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా రాజు, ఆంజనేయులు రెడ్డి ,భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 83
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
17 Sep 2026 18:27:30
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
గిరిజన సంక్షేమానికి కేసీఆర్ హయాంలో ప్రత్యేక ప్రాధాన్యం.
