గ్రామంలో మద్యపాన నిషేధం పై ఎస్సై కి వినతి పత్రం అందజేత

గ్రామంలో మద్యపాన నిషేధం పై ఎస్సై కి వినతి పత్రం అందజేత

చిలిపిచేడ్ (మెదక్ జిల్లా) మండలంలోని అజ్జమరి గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధించాలని కోరుతూ గ్రామస్తులు స్థానిక ఎస్సై నర్సింలుకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మద్యం విక్రయాలు, మద్యం సేవించడం కారణంగా పలు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్తులు ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు. మద్యం కారణంగా యువతపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. గ్రామంలో మద్యం విక్రయాలను నియంత్రించి, అనధికారికంగా మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలిచి,గ్రామంలో మద్యం నిషేధానికి చర్యలు చేపట్టాలని కోరారు.వినతిపత్రాన.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News