బిజినపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

బిజినపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూల్ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజినపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇందిరా రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం సిద్ధించిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పంచాయతీ పాలకవర్గం పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డమీది మహేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News