ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం:
బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు..
నసురుల్లాబాద్ మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అత్యంత వైభవం గా నిర్వహించారు. ఈ సందర్భం గా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు అనంతరం భారతా మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణా క్షరాల తో లిఖించదగ్గ రోజని కొనియాడారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, నైజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17 న విముక్తి లభించిందని గుర్తు చేశారు. ఈ విముక్తి కోసం ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాల ను సైతం లెక్కచేయకుండా పోరాడారని, వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. అమర వీరుల ఆశయాల కు అనుగుణంగా తెలంగాణను అభివృద్ధి పథం లో ముందు కు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల వీరత్వాన్ని, నిజాం రజాకార్ల అరాచకాల పై సాగిన పోరాట చరిత్రను నేటి తరానికి చాటిచెప్పడాని కే బీజేపీ ప్రతి ఏటా ఈ వేడుకల ను అధికారికంగా, ఘనం గా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్ , గంగాధర్ గుప్తా, మండల ఉపాధ్యక్షులు శేఖర్, బాకా నాగరాజు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు రాందాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సాయిలు, బండపల్లి శ్రీను, జెల్ల సాయిలు, రవికాంత్, నితిన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


