గణనాదునికి మొదటి రోజు పూజ నిర్వహించిన
కాశిరెడ్డి పల్లి ఉప సర్పంచ్ దుబ్బాక మహేష్
సిద్ధిపేట,మర్కుక్ : వినాయక చవితి సందర్బంగా మర్కుక్ మండల పరిధిలోని కాశిరెడ్డి పల్లి గ్రామంలో శ్రీ విగ్నేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహం ప్రతిష్టించారు.మొదటి పూజ స్థానిక ఊప సర్పంచ్ దుబ్బాక మహేష్ దంపతులు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్ద ప్రసాదలు అందజేశారు.వారు మాట్లాడుతూ ముందుగా మండల,గ్రామ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయకుని కృపతో గ్రామ ప్రజలందరు పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని,గ్రామంలోని ప్రజలు చేపట్టే పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా విజయవంతం కావాలని ఆ వినాయకుడిని కోరమన్నారు.వారితో పాటు శ్రీ విగ్నేశ్వర యూత్ కమిటీ సభ్యులు భాస్కర్,బాబు,బాల్ రాజు,నవీన్,వెంకటేష్,సురేష్,నరేష్,దుబ్బాక భాను,దొమ్మాట భాను,కృష్ణ,రమేష్,జయంత్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


