బినామీ డాక్టర్లతో వైద్యం చేయిస్తున్న ప్రభుత్వవైద్యులు
- ఆసుపత్రిలో వైద్యుల తీరు మారదా
- డ్యూటీ డాక్టర్ డుమ్మా - ప్రైవేట్ వ్యక్తితో వైద్యం
జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో ఆసుపత్రి వైద్యుల తీరు మారడం లేదు.జోగిపేట ఏరియా అస్పత్రిలో ముగ్గురు డాక్టర్లు సస్పెండ్ అయిన ఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైదోనారాయణ అనే పదం నానుడి నోట ఎంతో పవిత్రంగా వైద్యుడిని గౌరవరవిస్తారు చేయవలసిన వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడం ఇక్కడి రోగులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రి జహీరాబాద్ లో వైద్యం అందించవలసిన డాక్టరుకు బదులు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిం చడంతో ఇక్కడి రోగులు అయోమయంలో పడ్డారు.రెండు మూడు రోజుల నుండి ఈ తతంగం జరుగుతున్నట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది.వైద్యం వికటించి ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరని రోగులు, ప్రజాసంఘాలు వైద్యుల ఇక్కడి వైద్యుల తిరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి భద్రత లోపాలు నిర్లక్ష్యం చేసుకోవడం వైద్యశాఖ పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు.అసలు ఆ వైద్యుడు ఎవరు? చికిత్సలో ఎదైనా జరిగితే కానీ బాధ్యత వహించాల్సింది ఎవరు అనేది ప్రశ్నలు వెలువడుతున్నాయి, బినామీతో ట్రీట్మెంట్ అందించడం ఏమిటి? ఈ వ్యవహారంపై ఉన్నత అధికారులు ఓ కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. డ్యూటీలో ఉండవలసిన డాక్టర్ విధులకు ఎగనామం పెట్టి వేరొక్కరిని తన స్థానంలో పెట్టినట్లు నిజమైతే వైద్యునిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోనీ సస్పెన్షన్ చేయాలి. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ ఎంఓ తో పాటు డాక్టర్లు కూడా అందుబాటులో ఎవరు లేకపోవడంతో రోగులు రెండు గంటల పాటు వైద్యం కోసం నిరీక్షించారని తెలిసింది. జహీరాబాద్ ఆస్పత్రి అంటేనే తెలంగాణ, కర్ణాటక సరిహదు నేషనల్ హైవే ఎపుడు ఎదో ఒక రోడ్ ప్రమాదం జరగడం సర్వసాధారణం రోడ్ ప్రమాదం గురియానవారు అస్పత్రికి ప్రాణాపాయ అత్యవసర సమయంలో వోస్తే చికిత్స అందిచల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ప్రభుత్వ అస్పత్రికి రావడానికి జంకుతున్నారు. ఈ ఆసుపత్రి వందలాది రోగులతో ఎప్పుడు రాద్దిగా ఉండే అస్పత్రి రోగులకు ఓపి చూసేందుకు వైద్యులు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఇక్కడ రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

వివరణ
డీ సి హెచ్ ఎస్ డాక్టర్. శ్రీధర్
డ్యూటీ డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం ఆ ఇద్దరిపై ఇద్దరు వైద్యుల దిసభ్య కమిటీతో విచారణ చేయిస్తామని
నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


