మామిడిపల్లి లో ఇందిరమ్మ ఇళ్ళు నూతన గృహప్రవేశం
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నర్సిములు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ పిఏసిఎస్ చైర్మన్ నజీర్ పటేల్, మాజీ కో ఆప్షన్ మెంబెర్ జహీర్ పటేల్,మండల నాయకులతో కలిసి కత్తేర విట్టల్ -లక్ష్మి కు చెందిన ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశం గావించి రిబ్బన్ ను కట్ చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లులేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తుందని అన్నారు.విట్టల్ లక్ష్మి లు మాట్లాడుతూ మంత్రి దామోదర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయికోడ్ వీరభద్రేశ్వర ఆలయ చైర్మన్ సతీష్ కులకర్ణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వినయ్,సీనియర్ నాయకులు శివ కుమార్, గ్రామమాజీ సర్పంచ్ మారుతీ,సీనియర్ నాయకులు గుమ్మడి శ్యామ్,మైనారిటీ సెల్ అధ్యక్షులు ఆఫీస్ పటేల్,నాయకులు మౌలా, ఆశం,యూనుస్,దౌలత్,ఇస్మాయిల్,మొయిన్ అజీమోద్దీన్,ఇమ్రాన్,తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


