త్వరలో సింగరేణిలో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తాం

త్వరలో సింగరేణిలో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తాం

కొత్తగూడెం : రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ కుమార్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్‌లను సింగరేణి ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ (రిజి. నెం. 1630/1982) ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, సభ్యులకు బొకేలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగారపు లింగమూర్తి సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లుతూ వినతిపత్రం సమర్పించారు. సింగరేణి సంస్థలో కమిషన్ పర్యటించి, కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరారు. సింగరేణి కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అవసరమైన అనుమతులు కల్పించాలని కొత్తగూడెం రీజనల్ సెక్రటరీ మధు కృష్ణ, కార్పొరేట్ ఏరియా ఇన్‌చార్జి వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. అలాగే సింగరేణి పరిధిలోని విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, సంస్థలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అంతర్గత వివక్షను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా కమిషన్ పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సానుకూలంగా స్పందించారు. సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలోనే యాజమాన్యానికి సూచించినట్లు గుర్తు చేశారు. త్వరలోనే సింగరేణి యాజమాన్యంతో సమావేశమై ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి వివక్ష లేదా అన్యాయం జరిగినా వెంటనే కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించిన ఆయన, కమిషన్ ఆదేశాలను అమలు చేయని యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, కార్మికులకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగారపు లింగమూర్తి, కేంద్ర కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆరెపల్లి రామచందర్, కొత్తగూడెం రీజనల్ సెక్రటరీ మధు కృష్ణ, కార్పొరేట్ ఏరియా ఇన్‌చార్జి వెంకటేష్, నాయకులు బాలునాయక్, మోహన్ చందు నాయక్‌తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Views: 229

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ 
శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు