అమ్మను కోల్పోయిన చిన్నారి

అమ్మను కోల్పోయిన చిన్నారి

  •  అండగా నిలిచిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • –తాటిపల్లి గురుకులంలో ప్రవేశం

​మల్యాల,: కష్టాల్లో ఉన్న వారికి ఆపద్బాంధవుడిగా, మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలుస్తూ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ​జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్ళపెళ్లి గ్రామానికి చెందిన కనక శారద అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో, ఆమె నలుగురు ఆడపిల్లలు అమ్మను కోల్పోయి అనాథలుగా మారారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ చిన్నారి తల్లుల కష్టాన్ని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేనున్నాను అంటూ కొండంత భరోసానిచ్చారు. ​ఇందులో భాగంగా సోమవారం నాడు ఆ నలుగురు బాలికలలో ఇద్దరిని తాటిపల్లి గురుకుల పాఠశాలలో స్వయంగా తీసుకెళ్లి ప్రవేశం కల్పించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భావోద్వేగంగా మాట్లాడుతూ. ​అమ్మను కోల్పోయిన ఆ చిన్నారుల బాధ వర్ణనాతీతం. ఆ చిన్నారి తల్లులను కేవలం పరామర్శించడమే కాదు.. వారి భవిష్యత్తును నా సొంత పిల్లల భవిష్యత్తుగా భావించి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. వారు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలబడే వరకు వారి చదువుకు, భవిష్యత్తుకు ఎలాంటి లోటు రానివ్వకుండా అండగా ఉంటాను అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ​ఆపద సమయంలో చిన్నారులకు పితృసమానుడిగా నిలిచి, చదువుల బాధ్యత తీసుకున్న సత్యం గొప్ప మనసుకు గ్రామస్థులు, ప్రజాసంఘాలు మరియు స్థానిక ప్రజలు  హర్షం వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో తాటిపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మానస, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News