ఘనంగా నిర్వహించిన వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు..

ఇల్లందు : వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, భారత రాజ్యాంగంపై ఫోటో సమాచార ప్రదర్శనను ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇల్లందు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సందర్శించారు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఇల్లందు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు,కేంద్ర సమాచార విభాగం,సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, నల్గొండ ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో సింగరేణి మైదానంలో నిర్వహించిన 150 ఏళ్ల భారత స్వాతంత్ర పోరాట శంఖారావం: వందేమాతరం అనే అంశంపై ఏర్పాటు చేసిన ఫోటో సమాచార ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా జి. కోటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్, సీబీసీ, నల్గొండ ఫీల్డ్ ఆఫీస్, వందేమాతరం జాతీయ గేయం చారిత్రక నేపథ్యం, దాని జాతీయ ప్రాముఖ్యత గురించి వివరించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వందేమాతరం గేయం ప్రజల్లో దేశభక్తిని రగిలించి, భాష, ప్రాంతం, సంస్కృతి భేదాలను అధిగమించి ఐక్యతకు ప్రతీకగా ఎలా నిలిచిందో ఆయన వివరించారు. అదేవిధంగా, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులను ఎలా పరిరక్షిస్తుందో వివరించారు. దేశభక్తి మరియు జాతీయ ఉద్యమాల్లో మహిళల పాత్ర అత్యంత కీలకమైందని, స్వాతంత్ర్య సమరంలోనూ, దేశ నిర్మాణంలోనూ మహిళల సేవలు విశేషమని, రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు, గౌరవం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ తొడేటి రాజు,ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, బి. సారిత, గణితశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్, టి. సురేంద్ర కుమార్, కామర్స్ లెక్చరర్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్శన విద్యార్థుల్లో దేశభక్తి భావనను, రాజ్యాంగ విలువలపై అవగాహనను మరింత బలపరిచిందని కళాశాల బృందం తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


