సూర్య విక్రమాదిత్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన మధిర కాంగ్రెస్ శ్రేణులు

సూర్య విక్రమాదిత్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన మధిర కాంగ్రెస్ శ్రేణులు

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క  అమ్మ ఫౌండేషన్ చైర్మన్  మల్లు నందిని విక్రమార్క  తనయుడు   సూర్య విక్రమాదిత్య   పుట్టినరోజు వేడుకలను మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి  సూర్య విక్రమాదిత్య  హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయ్ కుమార్ గారు, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు   ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత రామనాథం, వైస్ చైర్మన్ ధని కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, మిరియాల వెంకటరమణ గుప్తా, కౌన్సిలర్లు శ్రీపాల శెట్టి వెంకట్రావు, నకిరికంటి రాజేశ్వరి, షేక్ రసీదున్, దార నాగార్జున, సర్పంచులు బట్ట అంజన్ బాబు, సంపసాల రామకృష్ణ, హరినాథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు  తూమాటి నవీన్ రెడ్డి  రామాలయం కమిటీ చైర్మన్ వంగవీటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.అలాగే వివిధ హోదాల్లోని కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సూర్య విక్రమాదిత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News