ఆరుతడి వరి పద్ధతి ద్వారా రైతులకు ఎంతో మేలు.

ఆరుతడి వరి పద్ధతి ద్వారా రైతులకు ఎంతో మేలు.

నల్లబెల్లి(వరంగల్ జిల్లా): ఆరుతడి వరి పద్ధతి ద్వారా రైతులకు, వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ట్రై కంపెనీ డైరెక్టర్ సుమన్, మిట్టి ల్యాబ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ దేవాదత్తు దాల్, గూగుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్లా అన్నారు. మండలంలోని కన్నారావుపేట రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన వరిలో ఆరు తడి పద్ధతి పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ గ్రహించే పని గురించి వివరించి రైతులను ఆన్ బోర్డ్ చేయడము, పొలముల మ్యాపింగ్, పొలాలలో ఏడబ్ల్యుడి ,(ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై) పైపు ఉపయోగం గురించి  వరి పొలానికి అందించే నీటి పద్ధతిని వివరించారు. వరి పొలానికి ఆరు తడి పద్ధతి ద్వారా నీరును అందిస్తే వరి ఏపుగా పెరిగి వేరు వ్యవస్థ సమృద్ధిగా ఏర్పడడంతో పాటు  చీడపీడల నుండి రక్షించడం జరుగుతుందని వివరించారు.అలాగే వరి లో ఎక్కువ నీరు ఉండడం ద్వారా మిథెన్ వాయువు ఏర్పడి వాతావరణ కాలుష్యం ఏర్పరుస్తుందని అన్నారు. ఏ డబ్ల్యుడి  పద్ధతి ఉపయోగించడం ద్వారా నీటిని తగ్గించి రాబోయే తరానికి నీటిని అందివ్వడం జరుగుతుందని సూచించారు. ట్రై అండ్ మిట్టి ల్యాబ్  రైతులు వాతావరణాన్ని రక్షిస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో  ట్రై అండ్ మిట్టి ప్రోగ్రాంలో రైతులందరూ చేరాలని తెలిపారు. ఇప్పటివరకు వరంగల్ జిల్లాలోని దాదాపు లక్ష ఎకరాల వరకు ట్రై అండ్ మిట్టి ల్యాబ్ ప్రతినిధులు వరి పొలాలలో పని చేస్తూ రైతులకు ఏ డబ్ల్యూ డి గురించి వివరించి ఆరుతడి పద్ధతిని పాటిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కన్నారావుపేట సర్పంచ్ పల్నాటి మూర్తి, నాగరాజు పల్లి మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, ప్రతాపరెడ్డి, డిస్టిక్ మేనేజర్ రాజు, క్లస్టర్ ఇన్చార్జులు, ఫీల్డ్ ఆఫీసర్లు, జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్లు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు
IMG-20260728-WA0062
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
శివంపేట( మెదక్): స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 27వ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరంతో పాటు విద్యా వికాస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ కో-ఆప్షన్ సభ్యులు...
విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం.
అక్రమ షట్టర్లకు పంచాయతీ నంబర్లు..!
ఎయిడ్స్ పై రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమం
పరకాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?