వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.

వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.

  • వాహనాలు ఆపి వీడియోలు తీసిన ప్రజలు.
  • వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచన

చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని చక్రియాల గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం అనంతరం అరుదైన ఘటన చోటుచేసుకుంది. పంట పొలాల నుంచి బయటకు వచ్చిన ఓ పెద్ద కొండచిలువ గ్రామ సమీపంలోని రహదారిని దాటుతూ కనిపించడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.ఆ సమయంలో శివంపేట నుంచి చక్రియాల గ్రామానికి వస్తున్న వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి కొండచిలువను ఆసక్తిగా వీక్షించారు. పలువురు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి.ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం కొండచిలువ సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, వర్షాకాలంలో పాములు, కొండచిలువలు వంటి అడవి జీవులు నీటి ప్రవాహాల కారణంగా రహదారులపైకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాహనాలను సురక్షితంగా నిలిపి, వాటిని రెచ్చగొట్టకుండా సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు
 
Views: 1005

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ