జాతి కోసం ప్రాణాలు అర్పించిన దండోరా బిడ్డలు ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం... ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ రోజు

WhatsApp Image 2026-03-01 at 4.21.33 PM

 

నల్లబెల్లి  : ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డలను స్మరించుకుని ఆదివారం 'మాదిగ అమరవీరుల సంస్మరణ రోజుని' పురస్కరించుకుని ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం ఆధ్వర్యంలో  మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ.....
జాతి కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాలుగా పోరాటం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అమర వీరులైన నాయకులకు  వారి ఆశయమైన ఎస్సీ వర్గీకరణను సాధించుకొని నేడు ఫలితాలను జాతి పొందుతున్న ఈ సందర్భంలో మాదిగ అమరుల త్యాగాలను, వారి జ్ఞాపకాలను, వారి పోరాట స్మృతులను గురించి రాబోయే తరాలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు పరికి కొర్నేల్,  మాజీ ఎంపీటీసీ జన్ను జయరావు, ఎమ్మార్పిఎస్ మండల నాయకులు కనుకం నవీన్, పొడేటి కిషోర్, గూడెపు భాస్కర్, కనకం శ్రీకాంత్, పొడేటి పవన్, బీసీ నాయకులు బత్తిని మల్లయ్య, సామల దేవేందర్, తంగెళ్ల వేణు, పున్నం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 29

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News