ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
సంగెం : మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య 42 వృత్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు 17 రాజేష్ ఉన్నారు. మృతుడు కటయ్య ప్రైవేటు హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయాడు. తీసుకున్న అప్పు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ ఫోన్ లో వేధింపులకు గురి చేయడంతో సదరు వ్యక్తి అప్పు తీర్చలేక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి నురుగులు రావడంతో ఇది గమనించిన భార్య వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఎంజీఎం కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతిని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


