ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యార్థినులకు ఘన సన్మానం
నల్లబెల్లి, వరంగల్ : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థినులను తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.పాఠశాలలో ప్రత్యేక అధికారిణి ఆవుల సునీత అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నాగెల్లి జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. “విద్య వేర్లు ఎంత చేదుగా ఉంటాయో, దాని ఫలాలు అంత మధురంగా ఉంటాయి” అని అన్నారు. విద్యార్థినులు ఇష్టంతో, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ప్రతి విద్యార్థిని ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, దాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమించాలని సూచించారు. ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవులు సాధించి తల్లిదండ్రులకు, గురువులక…
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


