ఉపాధి కూలీలకు ఊరట.. జిల్లాలో జోరుగా వీబీజీ రామ్‌జీ పనులు
- పేద కుటుంబాలకు ఆర్థిక కొండంత అండగా నిలిచేందుకు ఉద్దేశించిన
- వీబీజీ రామ్‌జీ’ పథకం కింద జిల్లాలో పనులు ఊపందుకున్నాయి.
నిజామాబాద్ : ద కుటుంబాలకు ఆర్థిక కొండంత అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ‘వీబీజీ రామ్‌జీ’ పథకం కింద జిల్లాలో పనులు ఊపందుకున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వర్షాలు క్రమం తప్పి కురుస్తుండటంతో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో కూలీలంతా ఉపాధి హామీ పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. జూలై నెలలో ప్రారంభమైన ఈ పథకం కింద గడిచిన పనిదినాల్లో ఏకంగా 4 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. గత ఆర్థిక మొత్తం వానాకాలం సీజన్‌లోనూ లక్ష దాటని పనిదినాలు ఈసారి స్వల్ప వ్యవధిలోనే 4 లక్షలకు చేరడం విశేషం. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కూలీలకు మొత్తం 11లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత వేగాన్ని పరిశీలిస్తే మిగిలిన 7లక్షల పనిదినాలను పూర్తి చేయడం సులభమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో రోజుకు 2వేల మంది కూలీలు కూడా రావడం కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో రోజుకు 5వేల నుంచి 6వేల మంది వరకు పనులకు హాజరవుతున్నారు.
రూ.97కోట్ల వేతనాలు..
ఇప్పటివరకు పనుల్లో పాల్గొన్న కూలీలకు రూ.97కోట్ల వరకు వేతనాలు చెల్లించగా, మరో రూ. 1.35 కోట్లు రావాల్సి ఉంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలో పనిదినాల సంఖ్యను ఇంకా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. మరొకవైపు ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉండటంతో తాగు, సాగునీటి కష్టాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఊటకుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను అధికారులు పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత, సామూహిక ఊటకుంటల నిర్మాణాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
జిల్లా ఉపాధి పనుల వివరాలివే..
మొత్తం జాబ్‌కార్డులు 2,54,910 ఉండగా.. యాక్టివ్ జాబ్‌కార్డులు 1,49,478 ఉన్నాయి. మొత్తం కూలీలు 4,68,961 ఉండగా.. యాక్టివ్ కూలీలు: 2,21,792 ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు వీబీజీరాం పథకంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వారన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


