శ్మశాన వాటికలో మురుగునీటి సమస్య పరిష్కరించాలి
నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు సర్పంచ్ పార్కల రాం రెడ్డి వినతిపత్రం
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ గ్రామంలోని శ్మశాన వాటికలో మురుగునీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఏర్పడు తున్నాయని నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు గ్రామ సర్పంచ్‌కు వినతిపత్రం అందజేశారు.శ్మశాన వాటికకు సమీపంలోని ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో శ్మశాన వాటికలోకి చేరుతోందని వారు తెలిపారు. దీంతో అక్కడ మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లడంతో పాటు పరిసర ప్రాంతాలు అపరి శుభ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. వర్షాలు పడిన సమయంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారు తోందని తెలిపారు.ఈ సమస్యపై గతంలో పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని సంఘం సభ్యులు తెలిపారు. శ్మశాన వాటికకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి, మురుగునీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ను కోరారు.గ్రామ పంచాయతీ అధికారులు సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, శ్మశాన వాటిక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


