కోర్పోల్ రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి

కోర్పోల్ రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి

లైన్‌మ్యాన్‌ను మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు వినతి

చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని కోర్పోల్ గ్రామ రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామానికి చెందిన రైతులు, బీజేపీ నాయకులు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. గ్రామానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, ప్రస్తుత లైన్‌మ్యాన్‌ను మార్చి రైతులకు అందుబాటులో ఉండే విధంగా బాధ్యతాయుతమైన లైన్‌మ్యాన్‌ను నియమించాలని వారు కోరారు. కోర్పోల్ గ్రామం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉందని, ప్రస్తు తం పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీటి అవసరం ఎక్కువగా ఉంటుందని రైతులు తెలిపారు. అయితే తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు సాగునీరు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలు ఏర్పడినప్పుడు సంబంధిత లైన్‌మ్యాన్ సమయా నికి అందుబాటులో లేకపోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రంగా మారుతు న్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత లైన్‌మ్యాన్‌ను మార్చి, రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొత్త లైన్‌మ్యాన్‌ను నియమించాలని వారు కోరారు. ఈ మేరకు సంబంధిత డీఈ, ఏడీఈ, ఏఈ అధికారులను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు అందజేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే నాలుగు రోజుల అనంతరం స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రైతులందరితో కలిసి ముట్టడిస్తామని, అవసరమైతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడతా మని వారు అధికారులకు తెలిపారు. రైతుల వినతిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు రెండు రోజుల్లో ఏబీ స్విచ్‌లు, బ్రేకర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లమొల్ల యాదిరెడ్డి, పుట్టి మల్లేశం, మోహన్ ముదిరాజ్ (బీజేపీ మండల జనరల్ సెక్రటరీ), సంగారెడ్డి పాండు, ప్రవీణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కౌలాగరి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-29 at 1.15.34 PM

Views: 199

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News