బుల్లెట్ రైలు పై అపోహలు వద్దు, ప్రజల ఆకాంక్షే ప్రాధాన్యం
- సూర్యాపేటకు బుల్లెట్ రైలు కచ్చితంగా వస్తుంది!
- అది మన మీదనే ఆధారపడి ఉంది
- మనం ప్రజా ప్రతినిధులను...
- నిలదీయకుండా మౌనంగా ఉంటే.
- మరో 80 ఏళ్లు రైలు గురించి మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది
- ముక్తకంఠంతో సూర్యాపేట ప్రజలందరూ గొంతు ఎత్తుదాం.
- రండి ఉద్యమంలో పాలి భాగస్తులు కండి
బుల్లెట్ రైలు... ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి బుల్లెట్ ట్రైన్ మొదటి అలైన్మెంట్ తిరిగి కొనసాగుతుందా...? ఈ చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగానే కొనసాగుతున్నట్లు సమాచారం.సూర్యాపేట మీదుగా బుల్లెట్ రైలు వస్తుందా? రాదా? స్టేషన్ ఉంటుందా? ఉండదా? ఇలా అనేక సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.సోషల్ మీడియాలో, ప్రజా చర్చల్లో భిన్నమైన సమాచారం ప్రచారంలోకి వస్తుండటంతో మరింత గందరగోళం నెలకొంటోంది.ఈ నేపథ్యంలో దేశ ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రం వారు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.బుల్లెట్ రైలు వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో అలైన్‌మెంట్, స్టేషన్లు, స్టాప్‌లు అన్నీ సర్వేలు, సాంకేతిక అధ్యయనాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా అవసరాలు వంటి అనేక అంశాల ఆధారంగా ఖరారవుతాయి.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మార్గం - దేశంలో తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ మొత్తం 508 కిలోమీటర్లు. ఇందులో 12 స్టేషన్లు ఉన్నాయి.ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లు ఉన్నాయి.ఈ మార్గంలో పరిమిత స్టాప్‌లతో ముంబై–అహ్మదాబాద్ ప్రయాణ సమయం సుమారు 2 గంటల 7 నిమిషాలు, అన్ని స్టాప్‌లతో సుమారు 2 గంటల 58 నిమిషాలుగా NHSRCL (నేషనల్ హై స్పీడ్ రైలు కార్పొరేషన్ లిమిటెడ్) పేర్కొంది. రైలు గరిష్ఠ ఆపరేటింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్లు. గంటకు ఇంతటి వేగం ఉన్నప్పటికీ ప్రతి స్టేషన్ వద్ద రెండు లేదా మూడు నిమిషాలు ఆగుతూ ఆగిన సమయాన్ని కవర్ చేసే విధంగా బుల్లెట్ రైలు స్పీడ్ ఉంటుందని నిపుణులు చర్చించుకుంటున్నారు.
బుల్లెట్ రైలు అంటే ....నాన్ స్టాప్ గా వెళ్లే రైలు మాత్రమే కాదు బుల్లెట్ రైలు అనగానే ఎక్కడ ఆగకుండా మొదటి స్టేషన్ నుండి చివరి స్టేషన్ వరకు హై స్పీడ్ తో వెళ్లే రైలు అని అందరూ అనుకుంటున్నారు.అది సరైనది కాదు... పైన ఇచ్చిన ఉదాహరణ ప్రకారంగా ముంబై టు సబర్మతి స్టేషన్ల వరకు 12 స్టేషన్లో స్టాఫ్లు ఉన్నాయి.ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు..బుల్లెట్ రైలు అంటే కేవలం ఒక నగరం నుంచి మరో నగరానికి నాన్‌స్టాప్‌గా వెళ్లే రైలు మాత్రమే కాదని. స్పష్టమవుతుంది. బుల్లెట్ రైలు వెళ్లే మార్గంలో ప్రధాన పట్టణాలు, ఆర్థిక కేంద్రాలు, ప్రజల రవాణా అవసరాలు, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని స్టేషన్లను ఏర్పాటు చేసే విధానం ఇందులో కనిపిస్తోంది. ఆయా ప్రజల ఆకాంక్షను బట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇంతే కాకుండా ముంబై టు శబరిమతి బుల్లెట్ రైలు నిర్మాణం ముందుగా ఆరు స్టేషన్లో అనుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు అక్కడి ప్రభుత్వ ప్రతిపాదన ప్రజా ఆకాంక్షల మేరకు ఆరు స్టేషన్లుగా ఉన్న దానిని 12 స్టేషన్లుగా మార్చారు.ఈ విషయం ముంబై టు సబర్మతి వైపుగా నిర్మాణం అవుతున్న బుల్లెట్ ట్రైన్ మార్గం మనకు ఒక మంచి ఉదాహరణ అని అందరూ గమనించాలి.
అదే ఆశ సూర్యాపేటకు ఎందుకు ఉండకూడదు? హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైలు ప్రతిపాదనలో తొలినాలలో శంషాబాద్ బాటసింగారం నార్కట్పల్లి సూర్యాపేట విజయవాడ వైపు వెళ్లే అలైన్మెంట్ ప్రతిపాదించబడింది. ఈ మార్గంలో సూర్యాపేటకు ప్రాధాన్యం లభించే అవకాశం అప్పట్లో కనిపించింది. ముంబై టు సబర్మతి రూట్ లో బుల్లెట్ రైలు కొనసాగుతున్న విధంగానే ఎన్నో సంవత్సరాలు గా రైలు కోసం ఎదురుచూస్తున్న సూర్యాపేట ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన మొదటి అలైన్మెంట్ కాస్త సూర్యాపేట ప్రజలకు జీవం పోసినట్లుగా అనిపించింది. ఇంతలోనే చేదు వార్త ఒకటి చెవిలో పడ్డట్టు అయింది. అంతమాత్రానికి నిరుత్సాహ పడాల్సిన పనిలేదు.ఇది వేరే రూట్ లో మార్చబడుతుంది అన్న వార్త పోరాట పటిమగలిగిన సూర్యాపేట ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే ఉద్యమ బాట పట్టారు. వేరే రూట్ కు మార్చిన ప్రభుత్వ యంత్రాంగం తమ ఆలోచనను కొనసాగించకుండా డీపీఆర్ ఇంకా విడుదల చేయకుండా అలా నిలిపివేసినట్లు తెలిసింది. కాగా సూర్యాపేట ప్రజలు తమకు కేటాయించిన రైలు తమ ప్రాంతంలో నుండే కొనసాగాలని గత మూడు నెలలుగా వివిధ రకాలుగా ఉద్యమాలు చేస్తున్నారు. తమకు రావలసిన బుల్లెట్ ట్రైన్ అవతలివాడు ఎత్తుకుపోయాడు దాన్ని మింగక ముందే తమ ట్రైన్ తాము తెచ్చుకోవాలని చేస్తున్న ఉదృత ఉద్యమ సమాచారం అందుకున్న ప్రభుత్వాలు ఆలోచనలో పడి రూటు మార్చాలనుకుంటున్న ప్రాంతాన్ని కూడా నిలిపివేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఎక్కువ అవకాశాలు సూర్యాపేటకి ఉన్నాయి బుల్లెట్ ట్రైన్ శంషాబాద్ టు సూర్యాపేట జాతీయ రహదారి 65 సమాంతరంగా విజయవాడ మీదుగా మద్రాస్ కొనసాగించడానికి ఎక్కువ అవకాశాలు సూర్యాపేట కె ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.ఎలాగూ జాతీయ రహదారి మనకు ఉండనే ఉన్నది దాని సమాంతరంగా కొనసాగించడానికి బుల్లెట్ ట్రైన్ మార్గం వేయడానికి నిర్మాణకులకు గాని కాంట్రాక్టర్లకు గాని ఇంజనీర్లకు అధికారులకు ప్రభుత్వాలకు తక్కువ ఖర్చు తక్కువ సమయం పట్టే విధంగా రూట్ లైన్ క్లియర్ గా ఉన్నది. స్టేషన్ల నిర్మాణం చేయడానికి కావలసినంత స్థలాలు కూడా అనుగుణంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.పెద్ద పెద్ద కొండలు గుట్టలు చెరువులు వాగులు వంకలు లాంటివి ఏవి లేకుండా ఉండడంతో బుల్లెట్ ట్రైన్ మార్గం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సూర్యాపేట ప్రజలు నిరాశ చెందాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ లైన్ మెంట్ పై చర్చే సర్వేలు స్టేషన్లో ఎంపిక వంటి ప్రక్రియలో ప్రజల అవసరాలు ప్రాంతీయ ప్రాధాన్యత భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలు కీలకమైన అంశాలుగా ఉంటాయి.సూర్యాపేటకు ఎందుకు ప్రాధాన్యం? భారతదేశ నాయకులారా ప్రజాప్రతినిధులారా రైల్వే అధికారులారా బుల్లెట్ రైలు సూర్యాపేటకు ఎందుకు రావాలి? అని మీరు అడిగితే మా దగ్గర అన్ని రకాల సమాధానాలు ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మార్గంలో ఉన్న సూర్యాపేట భౌగోళికంగా కీలక ప్రాంతం.సూర్యాపేట కోదాడ నకిరేకల్ చిట్యాల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణాలను అనుసంధానించే రవాణా వ్యవస్థకు ఈ ప్రాంతం ఇప్పటికే ఒక ప్రాముఖ్యమైన కేంద్రంగా కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతుంది. కోట్లల్లో వ్యాపారాలు చేసే శ్రీమంతులు సైతం ఇదే ప్రాంతాలకు సంబంధించిన పట్టణాలలో వేల సంఖ్యలో ఉన్నారు. అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగా జన సందోహం తిరిగే ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ప్రతిరోజు జాతీయ రహదారి 65 గుండా లక్షలాది మంది రోజుకు బస్సుల ద్వారా కార్లు పలు రకాల వాహనాల ఆధారంగా ప్రయాణిస్తున్నారు. సూర్యాపేట ప్రజల ఆకాంక్ష అందువల్ల సూర్యపేట ప్రజల ఆకాంక్ష ఒక్కటే బుల్లెట్ రైలుకు సూర్యాపేటకు తగిన ప్రాధాన్యం కల్పించాలి.అవసరమైతే సూర్యాపేటలో స్టేషన్ ఏర్పాటు చేయాలి.ఇది కేవలం ఒక పట్టణం కోరిక కాదు ఒక రాజకీయ నాయకుల కోరిక కాదు వ్యాపారస్తుల కోరిక కాదు పోరాట గడ్డలో పుట్టిన ప్రతి పౌరుడి గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన తమ భవిష్యత్తు పైన ఒక చిరకాల వాంఛ గా ప్రభుత్వాలు చూడాలి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలపైన ప్రభుత్వ అధికారుల పైన ఎంతైనా ఉన్నది అన్న సంగతి ప్రభుత్వాలు తెలుసుకోవాలి. భవిష్యత్తులో సూర్యాపేటలో విద్యా వైద్యం వ్యాపారం పరిశ్రమలు ఉపాధి రవాణా రంగాల్లో మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం గా ప్రజలు బుల్లెట్ ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి సాధించుకోవడానికి ఉద్యమిస్తున్నారు.
ఈ రూట్ లో బుల్లెట్ ట్రైన్ వస్తే...20 స్టేషన్లు ఉంటాయా? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 సమాంతరంగా చెన్నై హై స్పీడ్ రైలు మార్గానికి సంబంధించి వివిధ దశల్లో వేరువేరు మార్గాలు స్టేషన్ ప్రతిపాదనలు చర్చలోకి వచ్చినట్లు సమాచారం.ఇటీవల ప్రచారంలోకి వచ్చిన ఒక ప్రతిపాదిత జాబితాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రాంతాలు కలిపి 18 స్టేషన్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.అయితే స్టేషన్ల సంఖ్య పేర్లు తుది-డిపిఆర్- అధికారిక ఆమోదాలు తుది అలైన్మెంట్ పై ఆధారపడి ఉంటాయి.20 స్టేషన్లు కచ్చితంగా వస్తాయని చెప్పడం కష్టమే అయినప్పటికీ భవిష్యత్తులో ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టేషన్లను పెంచే అవకాశం మార్పులు జరిగే వీలు ఉంటుంది అపోహలకు కాదు ఉద్యమానికి సమయం ఎవరో కల్పిస్తున్నటువంటి అపోహలను పక్కనపెట్టి ఉద్యమం చేసి సాధించుకునే మార్గంలో ఆలోచన చేయాలి. బయటివాడు కాదు మనోడే మన ప్రాంతపుడే మనతోపాటు వృత్తి చేసేవాడే రోజు మనతో మాట్లాడే వాడే మనతో నవ్వుతూ మాట్లాడతాడు అవతలకు వెళ్లి గోతులు తొవ్వుతాడు మనకు బద్ద శత్రువులా తయారవుతాడు. మనల్ని నానా రకాలుగా వెనుకకు లాగుతూ ఉంటాడు నిరుత్సాహ పరుస్తాడు. ఉద్యమం చేయలేక చేతకాక చేవ చచ్చిన వాడిలా ఉంటూ చేసేవారిని తక్కువ అంచనా చేసి అపహస్యం చేసి మాట్లాడుతుంటాడు. ఉద్యమం చేసి ఎక్కడ తమ కంటే ఎక్కువ పేరు సంపాదించుకుంటాడో నన్న ఆలోచనతో కుళ్ళు కుతంత్రాలతో తాను నిద్రపోకుండా మనకు నిద్ర పట్టకుండా చేస్తాడు. బద్నాం చేస్తారు.నిందలు వేస్తారు. ఇలాంటివన్నీ ఉద్యమకారుల చెవిలో పడ్డప్పుడు అసలు లెక్కచేయొద్దు.ముందుకు కొనసాగాలి ట్రైన్ సాధించేవరకు విశ్రమించేది లేదు.తెలంగాణ రాష్ట్రాన్ని సైతం ఎన్నో ఉద్యమాలను చేసి సాధించుకున్నాం. అదేవిధంగా ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ సాధించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ ముందుకు రావాలి ముంబై టు అహ్మదాబాద్ 508 కిలోమీటర్లు బుల్లెట్ రైలు గంటకు 300 కిలోమీటర్ల పైగా వేగా వెళుతుంది.అలాంటిది సూర్యాపేటలో ఎలా ఆగుతుంది అని అనుకోకూడదు.ఆ ప్రాంతంలో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి.అక్కడ 12 స్టేషన్ల ఏర్పాటు జరుగుతుంది. అలాంటప్పుడు శంషాబాద్ టు విజయవాడ చెన్నై బుల్లెట్ రైలు వెళ్లడానికి ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు స్టేషన్ల కోసం పోరాడడంలో తప్పులేదు
ప్రత్యేక కథనం
సీనియర్ పాత్రికేయులు కందుకూరి యాదగిరి – 9640282050
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


