చదువు తో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలి....
మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్
ఆదిలాబాద్: దిలాబాద్‌లో నిర్వహించిన పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడా పోటీల కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి అని అన్నారు. క్రీడలు ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అదిలాబాద్ జిల్లా స్పోర్ట్స్ స్కూల్ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో బ్రెజిల్‌లో పాల్గొని జిల్లా పేరును నిలబెట్టిన మోతం హర్షవర్ధన్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. బాలురు, బాలికలు అందరూ ప్రతిరోజూ క్రీడలకు సమయం కేటాయించి, చదువుతో పాటు స్పోర్ట్స్‌లోనూ ముందుకు సాగాలి అని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ స్కూల్ ఉపాధ్యాయులు, కోచ్‌లు, సిబ్బందిని మున్సిపల్ చైర్‌పర్సన్ అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


