రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఆర్ఐ
నాంపల్లి, :మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) రాళ్లబండి గోపిరాజు ఫిర్యాదుదారుడి వ్యవసాయ భూమికి సంబంధించిన పౌతి రిపోర్టును తహసిల్దార్ కు సమర్పించే అధికారిక పనికి గాను యాదగిరి ప్రైవేట్ వ్యక్తి అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి ఫిర్యాదుదారిని నుంచి రూ. 15000 లంచం డిమాండ్ చేసి ఆర్ఐ తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికా రులకు పట్టుబడ్డాడు. లంచం రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీబీ డిఎస్పి జగదీష్ చందర్ మాట్లాడారు. ఒక రెవెన్యూ సంబంధిత పనిని పూర్తి చేసేందుకు రైతు దగ్గర ఆర్‌ఐ రూ. 20వేలు లంచం డిమాండ్ చేసినట్లు రైతు నుంచి ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధి కారులు రంగంలోకి దిగారు.ముందస్తు ప్రణాళికలో భాగంగా ఫిర్యాదుదారు నుంచి రూ. 20వేలు డిమాండ్ చేయగా రూ.15 వేల నగదును మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు సమీపంలో ప్రైవేట్ వ్యక్తి ఎదుల్ల యాదగిరి ఆర్ఐ కి ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అనంతరం ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయానికి వారిని తీసుకొచ్చి విచారించారు. సంబంధిత రికార్డులు, పత్రాలను పరిశీలించినట్లు పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఏ-01గా ఆర్ఐ రాళ్లబండి గోపిరాజు, ఏ-2గా ప్రైవేటు వ్యక్తి ఆర్ఐ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎదుల్ల యాదగిరి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. న్యాయ విచారణ నిమిత్తం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి నాంపల్లి కోర్టు ముందు మంగళవారం ఇద్దరినీ హాజరుపరచనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరమని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను 1064 నెంబర్ ను సంప్రదించాలని, ఏసీబీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


