భార్య సర్పంచ్ అన్ని తానై అధికారం చెలాయిస్తున్న భర్త
సర్పంచ్ భర్త పై ప్రజావాణిలో ఫిర్యాదు
నిజామాబాద్ : భార్య సర్పంచ్ గా గెలువగా భర్త అన్ని తానై గ్రామంలో అధికారం చెలాయిస్తున్నరని బందారం సంతోష్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ ను కలసి అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రజావాణిలో విన్నవించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన సర్పంచ్ నీరడి జ్యోతి భర్త నిరడి రవి తానే సర్పంచ్ నంటు అధికారం చలాయించడమే కాకుండా, అధికార కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని, ప్రశ్నిస్తే తానే సర్పంచ్ నని చెబుతున్నాడు అన్నారు. అడిగినందుకు టార్గెట్ చేసి షాపు వద్ద ఉన్న మంచినీటి నల్ల ను మూసి వేయించడం జరిగింది అన్నారు. తనకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ, నచ్చని వారిని ఇబ్బంది పెడుతున్నారని, ఎలాంటి అధికారం లేకున్నా సర్పంచిగా చలామణి అవుతున్న రవి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


