ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలను భారీగా తరలించాలి
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
గంభీరావుపేట, : గంభీరావుపేట మండల కేంద్రంలోని షాదీఖానాలో మంగళవారం రోజున రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... సిరిసిల్ల ప్రజలు గత పాలనతో విసిగిపోయారు అని,సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. రైతులు, నేత కార్మికులు, యువత, మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది అని అన్నారు. ఈ నెల 30న సిరిసిల్లలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సందేశం ఇవ్వనున్నారు.పద్మశాలి నేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై సభలో స్పష్టత ఇవ్వనున్నారు.గత పదేళ్ల పాలనలో సిరిసిల్ల ప్రాంతానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.గ్రామాల వారీగా సభకు వచ్చే ప్రజల వివరాలతో జాబితాలు సిద్ధం చేయాలని నాయకులకు సూచించారు. అంచనాలకు మించి భారీ సంఖ్యలో యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు సభకు హాజరయ్యేలా చూడాలని కోరారు.సంక్షేమ పథకాలకు అర్హులై ఇంకా ప్రయోజనం పొందని వారికి పథకాలు అందేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు వేషాల వెంకటి, భూమక్క బలరాం రెడ్డి, నాయకులు, పార్స్ హనుమాన్లు, మాజీ మండలాధ్యక్షులు హమీద్, కొమిరిశెట్టి తిరుపతి, జోగు సురేష్ ,బంగ్లా రాజు గౌడ్, దిశెట్టి రాజశేఖర్, టేకుమల ప్రవీణ్, ఎల్ల బాలకృష్ణ, గోపయ్య గారి లక్ష్మీనారాయణ గౌడ్, గౌరీ శంకర్ , ప్రజాప్రతినిధులు కలిసి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


