డ్రగ్స్ నిషేధంపై అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ
నిజామాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మేరా యువభారత్ మరియు విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నశాముక్త యువ వికసితభారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల మరియు కళాశాలలో నా ఆరోగ్యమే నా గర్వకారణం అనే నినాదంతో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్ ఎస్ ఆర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మేరా యువభారత్ నశాముక్త వికసిత్ భారత సంకల్ప అభియాన్ పురస్కరించుకొని డ్రగ్స్ నిషేధంపై ప్రతిజ్ఞ మరియు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ యువత వారి వ్యక్తిగత జీవితాన్ని మత్తు పదార్థాలకు బానిసలై కోల్పోతున్నారని ఏ సందర్భంలోనైనా ఎటువంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలు లేని భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములమై కట్టుబడి ఉండాలని అంతేకాకుండా ప్రతి ఒక్కరి కుటుంబం స్నేహితులు బంధువులు పొరుగువారు మరియు అందరూ మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. వికసిత భారత్ కోసం నషాముక్త యువత అనే సంకల్పాన్ని నెరవేర్చడంలో ప్రతి ఒక్కరి సహకారాన్ని అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉత్తమ నైతిక విలువలను పాటిస్తూ మత్తు పదార్థాలు లేని జీవితాన్ని గడపాలని సమాజంలోని ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తూ చైతన్యవంతమైన సాధికారత కలిగిన మరియు నశాముక్త భారత దేశ నిర్మాణానికి నిరంతరం కృషి చేయాలని డ్రగ్స్ రహిత భారతదేశం కోసం పాటుపడాలన్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాలలో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ప్రతిరోజు వారిని గమనిస్తూ ఉండాలన్నారు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నషాముక్త యువ ఫర్ వికసితభారత్ సంకల్పబియాన్ పై విద్యార్థినీ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ గారు మాట్లాడుతూ యువత కోసం 100 ఆదివారాలు ప్రత్యేకంగా పని చేయడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని వారి బంగారు భవిష్యత్తు చేతులారా నాశనం చేసుకోవద్దని మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని అన్నారు. అదేవిధంగా మానసిక వ్యాధులు ఉన్నవారు టోల్ ఫ్రీ నెంబర్ 14416కు కాల్ చేసి జిల్లా సైకియాట్రిస్ట్ ద్వారా సలహాలు సూచనలు చికిత్స పొందాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మానసిక వ్యాధుల నిపుణులు డాక్టర్ రవితేజ మాట్లాడుతూ తీవ్రవాద దేశాల నుండి మత్తు పదార్థాలను గంజాయిని భారత దేశంలోకి రహస్యంగా చేరవేస్తున్నారని ప్రతి ఒక్క యువత అప్రమత్తంగా ఉండి మత్తు పదార్థాలకు గంజాయికి బానిస కాకుండా ఉండాలన్నారు. స్మోకింగ్ డ్రింకింగ్ మత్తు పదార్థాలు డ్రగ్స్ ఆల్కహాల్ లాంటి వ్యసనాలకు బానిసలైన ఎవ్వరైనా జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించే డి అడిక్షన్ సెంటర్ కి రిఫర్ చేయాలని ఉచిత చికిత్స అందిస్తున్నామని దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నశాముక్త యువ వికసిత భారత్ సంకల్ప అభియాన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి రవికుమార్ , డి ఐ ఓ డాక్టర్ అశోక్ ,జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకన్న, ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ నవ్య, ఎయిడ్స్ అండ్ లెప్రసీ మెడికల్ అధికారి డాక్టర్ భార్గవి, వివో ఎమ్ సి హెచ్ డాక్టర్ శిఖరా,డిప్యూటీ డెమో దుర్గారావు, డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, డిపిఎమ్ఓ సుధాకర్, కళాశాల విద్యార్థిని విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు, వైద్య సిబ్బంది , కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


